Vollyball (Telugu)
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బాల్‌గేమ్స్‌లలో వాలీబాల్ ఆట ఒకటి. దీనిని 1895వ సం||లో విలియం జి.మోర్గాన్ అను వ్యాయామ ఉపాధ్యాయుడు కనుగొన్నాడు. ఇతడు అమెరికాలోని హోల్యోక్‌లో యంగ్‌మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ (వై.ఎం.సి.ఎ.)లో ఫిజిరల్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. ఇతడు బాస్కెట్‌బాల్ అంత వేగము కాకుండా, వృద్ధుల కొరకు గాను ఒక ఇండోర్ ఆటను ఆడుకునేందుకు వీలుగా వుండే విధంగా 'మిన్‌టొనెట్టి' అనే పేరున మొదట ఈ వాలీబాల్ గేమ్‌ను రూపొందించాడు. దీనిని స్ప్రింగ్‌ఫీల్డ్ నందు వై.యం.సి.ఎ. డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ సమయంలో ప్రదర్శించారు. ఇందులో మోర్గాన్ లాన్ టెన్నిస్ నెట్‌ను కోర్టు మధ్యలో వుంచి సాకర్‌బాల్ లోని బ్లాడర్‌లో గాలిని నింపి బాల్‌గా తయారుచేసి ఈ ఆటను ప్రదర్శించాడు. ఈ ఆట ప్రదర్శనలో ఒకరుగా పాల్గొన్న డాక్టర్ ఆల్‌ఫ్రెడ్ హల్‌స్టిడ్ ఈ గేమ్‌కు 'వాలీబాల్ గేమ్'గా పేరును పెట్టాడు. ఎందుకంటే ఆటలో బాల్ వాలీ అవుతుంది. కనుక అలా పిలవడం అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నాడు.
-
Author: Gangadhara Reddy
- Publisher: Navaratna Book House (Latest Edition)
-
Paperback: 79 Pages
- Language: Telugu