Thathsama Chandrika (Telugu) - 2013
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (1897-1982) సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో దిగ్దంతులైన పండితులు. కవి, అనువాదకుడు, విమర్శకుడు, లాక్షణికుడు. గద్వాల, వనపర్తి వంటి సంస్థానాలలో సన్మానాలు పొందారు. తత్సమచంద్రిక, కావ్యాలంకార సంగ్రహ వ్యాఖ్యానము, ఆంధ్రప్రబంధ కథలు, కీర సందేశము, ద్వంద్వయుద్ధము, కథాకదంబము, వాసవదత్త, జాతక కథాగుచ్ఛము, కావ్యమంజరి మొదలైన బహుగ్రంథాలు రచించారు. మనుచరిత్రము, కళాపూర్ణోదయ కథను సంస్కృతంలోకి అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కథలను సంస్కృతంలోకి అనువదించారు. సంస్కృతాంధ్రాలలో సమప్రతిభతో సృజనాత్మక రచనలు వెలువరించారు.
సూర్యనారాయణశాస్త్రిగారి కావ్యాలంకార సంగ్రహవ్యాఖ్య అలంకారశాస్త్రం చదువుకొనే తెలుగు విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఎమెస్కో ఈ గ్రంథాన్ని ప్రచురించింది.
‘తత్సమ చంద్రిక’ తెలుగులో మనం వాడే తత్సమ శబ్దాలన్నిటి స్వరూప స్వభావాలను విశ్లేషించే గ్రంథం. తెలుగు రచయితలు, కవులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా రచయితలందరు ఉపయోగించు కోవలసిన గ్రంథం. మనం నిత్యం వాడే పదాల సాధుత్వ, అసాధుత్వాలను నిర్ణయించే గ్రంథం.
- Author: Surya Narayana Shasthri
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 520 pages
- Language: Telugu