Savarkar Hindutvam (Telugu)
''రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించడండి''.. హిందూత్వ సిద్ధాంత కర్త వినాయక్ దామోదర్ సావర్కర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదమిది. నేడు కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను, చర్యలను పరిశీలిస్తే సావర్కర్ చూపిన మార్గంలో సంఘ్ పరివార్ పయనిస్తోందన్న విషయం బోధపడుతుంది. సంఘ్ పరివారం నేడు ప్రచారం చేస్తున్న ''హందూత్వ'' సిద్ధాంత రూపకర్త సావర్కర్. 1928లో ఆయన రాసిన ''హిందూత్వ: ఎవరు హిందువు'' అన్న కరపత్రంలో హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వాస్తవానికి 1923లో ఇంగ్లీషులో ''హిందూత్వ సారం'' అన్న శీర్షికతో వెలువడిన కరపత్రాన్ని సావర్కర్ మరాఠీలోకి అనువదిస్తూ దాని శీర్షికను మార్చాడు. విశేషం ఏమిటంటే సావర్కర్ నాస్తికుడు. ఆయనకు దేవుని మీద నమ్మకం లేదు. ఆయన హిందూ మతాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలిచేందుకే హిదూత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
-
Author: A.G. Nurani
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 174 Pages
- Language: Telugu