Putting the Power of Your Subconscious Mind to Work (Telugu) Paperback – 2012
ఉపచేతనాధ్యయనవేత్త విలువైన సలహాకు తొలి ముద్రణ
దశాబ్దాల తరబడి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ సాగించిన అధ్యయనం, ప్రసంగాల ఆధారంగా ఈ కొత్త రచన రూపొందింది. మీకు అభిరుచి వున్న వృత్తి, వ్యాసంగాల్లో విజయాల్ని సాధించడానికి అనుగుణంగా మీ ఉపచేతనాశక్తిని ఎలా వినియోగించుకోవచ్చునో ఈ పుస్తకం విశదపరుస్తుంది.
వృత్తి, వ్యాసంగాల్లో కొత్త పుంతల్ని తొక్కిన అనేకమంది వ్యక్తుల నిజజీవితానుభవాల్నే సోదాహరణలుగా తీసుకుని వెలువరించిన రచన ఇది. అతిసరళమైన చిన్నచిన్న మార్పుల్ని చేసుకోవడం ద్వారా వృత్తిపరంగా లక్ష్యాన్ని సాధించడంలోను, వాటిని విస్తృతపరచుకోవడంలోను ఈ పుస్తకం మీకు సహాయకారిగా ఉంటుంది. ఇవాళ ఈ పుస్తకం సహాయంతో మీరు చేసే ఏ పనైనా మీ జీవితపర్యంతమూ శాశ్వతవిలువ కలిగిన సానుకూల ఫలితాన్ని మీకు అందిస్తుంది.
కార్యాలయంలో దైనందిన సవాళ్ళని ఎదుర్కొని, వాటిని అధిగమించి మీ అధికారుల, సహచరుల మన్ననల్ని పొందడానికి అవసరమయ్యే అన్ని సలహాలను 'మీ ఉపచేతనే మీ సేవకుడు' (ఉపచేతనా శక్తిని మీ పనికి అనుగుణంగా వాడుకోవడమెలా?) అనే ఈ పుస్తకం మీకు అందిస్తుంది. ఈ పుస్తకంలోని అధ్యాయాల్లో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి :
మీ లక్ష్యాల్ని నిర్వచించుకోవడం, వాటిని సాధించడం
ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ విలువను వృద్ధి చేసుకోవడం
ఆందోళనను అధిగమించడం
మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకోవడం
చెడు అలవాట్లని వదుల్చుకోవడం
నాయకునిగా ఎదగడం
ఇబ్బంది పెట్టే వ్యక్తులతో సామరస్యంగా ఎలా మెలగాలో నేర్చుకోవడం
సమయపాలన పాటించడం
మీ ఆలోచనల్ని, భావాల్ని వాణిజ్యపరంగా చక్కగా వాడుకోవడం
మీ వృత్తి, వ్యాసంగాల్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడం
మనస్తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టం పుచ్చుకున్న జోసెఫ్ మర్ఫీ, పిహెచ్.డి, డి.డి. ప్రపంచంలోనే ఎన్నదగిన మేధావి. ఆయన 'మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి' (ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్) వంటి ఎన్నో అత్యధికంగా అమ్ముడైన' పుస్తకాల్ని రచించారు. భౌతిక, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే కిటుకుల్ని, వాస్తవిక పద్ధతుల్ని ఆయన అద్భుతంగా అందిస్తారు. ఈ సామర్ధ్యమే ఆయనకు దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
- Author: Joseph Murphy
- Paperback: 261 pages
- Publisher: Manjul Publishing House (Latest Edition)
- Language: Telugu