Priya Mitrulaku (Telugu)
లేఖలు రాయడం అనేది ఒక కళ. అవి వ్యక్తి మనస్సును ప్రతిబింబిస్తాయి. రాసే వ్యక్తి తన భావాలను, ఉద్వేగాలను తేటతెల్లంగా, అరమరికలు లేకుండా తెలియజేసే సాధనం ఉత్తరం. చరిత్రకారులు చరిత్రను ఆధారంగా చేసుకొని జీవితచరిత్రలు రాయగలుగుతారే తప్ప; కథానాయకుని మనస్సులోని ప్రగాఢ భావాలను అర్థం చేసుకోలేరు గదా! అయితే సాధారణ వ్యక్తులు రాసిన ఉత్తరాలకు, మహాత్ములు రాసిన ఉత్తరాలకు చాలా తారతమ్యం ఉంది. సూర్యుడు వెలుగు ఇచ్చినట్లే దివిటీ కూడా వెలుగునిస్తుంది. కానీ ఈ ఒక్క ధర్మం చేత మాత్రమే సూర్యుడు, దివిటీ సమానమని తలచరు కదా! మహాత్ములకు లోకమే కుటుంబం. ఈ కారణంగానే గొప్ప ప్రజాసేవకుల వ్యక్తిగత ఉత్తరాలకు అంత ప్రాచుర్యం లభించింది.
స్వామి వివేకానంద తన మద్రాసు శిష్యులను, ఇతరత్రా ప్రాంతాలలోని శిష్యులనూ, మిత్రులనూ ఉత్తేజపరుస్తూ సుమారుగా 750కు పైగా ఉత్తరాలు రాశారు. వారు రాసిన ఉత్తరాలను గురించి స్వామి వివేకానంద ఇలా అంటారు: "ప్రేమ, కృతజ్ఞత, విశ్వాసం నిండిన హృదయంతో మీ కోసం ఈ మాటలు రాసేందుకు నా కలాన్ని తీసుకొంటున్నాను. దీన్ని మొదట మీకు చెప్పనివ్వండి. నా జీవితంలో నేను కలిసిన, ఉత్తమ విశ్వాసాలను కలిగి ఉన్న కొద్దిమందిలో మీరూ ఒకరు. స్పందించే శక్తి, జ్ఞానాల అద్భుత మేళవింపు సంపూర్ణంగా మీ సొంతం. ఆలోచనల్ని కార్యరూపంలోకి తీసుకురాగల వ్యవహార సమర్థత కూడా మీకుంది. అన్నిటినీ మించి మీరు శ్రద్ధావంతులు. అందుకే నా భావనల్లో కొన్నింటిని మీకు తెలియపరుస్తాను."
-
Author: Swami Vivekananda
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback:
- Language: Telugu