Pramukha Nobel Scientistulu (Telugu)
20వ శతాబ్దంలో సైన్సు - టెక్నాలజీ అప్రతిహతంగా పురోగమించింది. సైన్సులో ఎన్నో నూతన విభాగాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రభుత్వాలు, యూనివర్శిటీలు, లేబొరేటరీలు, సైన్సు, అభివృద్ధికి, వివిధ దేశాల సైంటిస్టులకు చేయూతనందించాయి. మూఢ నమ్మకాలు, అజ్ఞానం పారద్రోలి, విజ్ఞానం, విస్తరింపచేసి, మానవ కళ్యాణానికి విశిష్ట కృషి జరిగింది 20వ శతాబ్దంలోనే.
20వ శతాబ్దం అణుయుగంగా రూపాంతరం చెందింది. ఒక ప్రక్క అణుశక్తి మానవ కళ్యాణానికి, రోగనిరోధానికి సాధానంగా మారితే, మరో ప్రక్క అణుశక్తిని అణ్యాయుధాలుగా రూపొందించడానికి అగ్రరాజ్యాల మధ్య పోటీ ప్రారంభమయింది. ATOMS FOR PEACE, మానవ కళ్యాణానికే అణుశక్తిని వినియోగించాలని ప్రముఖ శాస్త్రజ్ఞులు కొందరు ఎలుగెత్తి చాటారు.
సైంటిస్టులు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలని గట్టిగా కోరారు. యుద్ధాలలో అణ్వాయుధాలను వినియోగిస్తే మానవజాతి సర్వనాశనం అవుతుందని తీవ్రంగా సమాజిక స్పృహ కలిగిన సైంటిస్టులు హెచ్చరించారు.
-
Author: Dr. Vijayam
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 280 Pages
- Language: Telugu