Nanalu Chepina Katha (Telugu)
ఈ పుస్తకంలో.... డబ్బు, నాణాల ఆవిర్భావం గురించీ, నాణాల సేకరణ ఒక శాస్త్రంగా పరిణతి చెందడం గురించీ రచయిత సవివరంగా రాశారు. ప్రాచీన దేశాలైన గ్రీసు, రోముల నాణాల విశేషాలూ వాటి వెనుక వున్న పసందైన గాథలూ ఇచ్చారు.
అలెగ్జాండరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలోని నాణాల చరిత్రనూ, అతని తరువాత రాజ్యం ఏలిన ఇతర హెలెన్ వంశీయ రాజులు ముద్రించిన నాణాల గురించీ వివరించారు. మధ్యయుగాలకి చెందిన ప్రాచ్య, పశ్చిమ దేశాల నాణాల చరిత్రని విశదీకరించారు. ఆనాటి టంకశాల గురించీ, డబ్బు చలామణీ గురించీ, గడిచిన చరిత్రని తవ్వి తీయడంలో నాణాల పాత్రని గురించీ పేర్కొని, ఇంకెన్నో ఆశ్చర్యకరమైన విషయాలను జోడించారు.
తార్తారు - మంగోలుల అధీనంలో వున్నప్పటి ప్రాచీన రష్యన్ నాణాల గురించీ, వారి నుంచి విముక్తి పొందిన దరిమిలా ఇప్పటిదాకా రష్యాలో జరిగిన ఎన్నో మార్పులని ప్రతిబింబించే నాణాల గురించీ తెలిపారు.
నాణాలు చెప్పిన కథ వినండి.
-
Author: G.A. Fadorov
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 128 Pages
- Language: Telugu