Nalupu Sampadakiyalu (Telugu) - 2017
శ్రీ బొజ్జా తారకం గారి భావజాలాన్ని భావితరాలకు అందించవలసిన సామాజిక బాధ్యతతో “బొజ్జాతారకం ట్రస్ట్”ను ఏర్పాటు చేయటం జరిగింది. ప్రథమ ప్రయత్నంగా 'నలుపు' పక్ష పత్రిక లో వారు రాసిన సంపాదకీయాలను పాఠకులకు అందిస్తున్నాం.
- బొజ్జా తారకం ట్రస్ట్
తెలుగు రాజకీయాలకు సంబంధించినంతవరకు 1989-1995 మధ్యకాలం - అంటే కారంచేడు మారణకాండ అనంతరం జన చైతన్యం ఉవ్వెత్తున ఎగసి పడిన కాలం. సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నీ ఒక కుదుపునకు గురైన కాలం. అన్ని ముఖ్యమైన సమస్యలపై ఆ రోజుల్లో విస్తృతమైన చర్చలు జరిగేవి. అదే కాలంలో నలుపు పత్రికలో బొజ్జా తారకం ఎంతో సాహసోపేతంగా, లోతైన పరిశీలనతో, ప్రత్యక్ష పోరాటానుభవంతో రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు ఆనాటి తరానికి ప్రశ్నించడం, సంఘటితమవడం, ఎదురుతిరగడంలో మార్గనిర్దేశనం చేశాయి. మతోన్మాదం, కులోన్మాదం మళ్లీ పడగవిప్పి బుసకొడుతున్న ఈ రోజుల్లో వాటి ఆవశ్యకత ఇప్పుడు మరింతగా వుంది.
-
Author: Bojja Tharakam
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
-
Paperback: 184 Pages
- Language: Telugu