Kulam Vargam (Telugu)
ఈనాటి ప్రధాన రాజకీయ పార్టీలను అవినీతి ఆవహించింది. నల్లధనం, గూండాగిరీ రాజ్యమేలుతున్నాయి. ఎన్నికలలో కులం, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అటు ఆర్థిక రంగంలో ఇటు సామాజిక రంగంలో బహుజనులు (ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలు) ఎక్కడా కనబడటంలేదు. రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం కేవలం నామమాత్రమే. ఈ పరిస్ధితుల్లో ప్రజలను సమీకరించి వారి సమస్యలను పరిష్కరించుకొనేలా చేయగలిగింది కుల, వర్గ నిర్మూలన కార్యక్రమం ఒక్కటే. అందుకే రచయిత ఈ పుస్తకాన్ని రచించారు.
కుల, వర్గ నిర్మూలన ఒక రాజకీయ కార్యక్రమం. దీనికి భూమిక డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, కార్ల్ మార్క్స్‌ల సిద్ధాంతాలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టటంలో ఎదురయ్యే సమస్యలతో అటు సైద్ధాంతిక భూమికకు, కార్యక్రమానికి కొత్త పదును పెట్టుకోవచ్చు. ఒక ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను. జనంలోకి వెళ్ళిన తర్వాత కొత్త శక్తి ఇది తెచ్చుకుంటుందనే నమ్మకం నాకు ఉన్నది. - బొజ్జా తారకం
-
Author: Bojja Tarakam
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
-
Paperback:
- Language: Telugu