ఆనందం 24 X 7 (Telugu) Paperback - 2015
అతి సరళ, అసాధారణ ఆనంద శోధనే ఈ 'ఆనందం 24x7!'
ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు. ఏ ఆచార క్రియలూ అందించబడ లేదు. ఇక్కడ ఏ ప్రగాఢ ధ్యాన ప్రక్రియలూ వివరించబడలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రస్తావనా లేదు.
ఇది మార్గనిర్దేశం చేసే పుస్తకం కాదు. ఇది సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదు. ఇది వెంటనే పనిచేసే ఒక 'ఆనంద సూత్రాన్ని' మీకందించదు. కాని, మీ అంతట మీరే ఆనందాన్ని ప్రత్యక్షంగా అన్వేషించేలా మిమ్మల్ని తప్పకుండా ప్రేరేపిస్తుంది. ఆనందం గురించి సద్గురు అందించిన సందేశాలకు అనుగుణంగా అల్లబడిన పిట్ట కథలు మిమ్మల్ని సద్గురుతో పాటు ఆనందపు అలల మీద ఒక అద్భుత రోలర్ కోస్టర్ రైడ్‌కి తీసుకెళతాయి.
ఈ పుస్తకం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించే వారందరి కోసం. మీరెవరైనా, ఏమి చేస్తున్నా, సద్గురు మాటలు మీలో ఒక అద్భుత ఆనంద తరంగాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత త్వరలోనే మీరు కూడా అనుక్షణం ఆనందంగా ఉండాలని పరితపిస్తారు.
ఈ పుస్తకాన్ని జితేంద్ర జైన్ సంకలనం చేశారు. జితేంద్ర జైన్ ఒక ఈశా ఫౌండేషన్ వాలంటీర్. ఆయన 2004లో సద్గురుచే ఉపదేశం పొందారు. హైద్రాబాద్ నుండి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ డిగ్రీని, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెంగళూరు నుండి MBA డిగ్రీని పొందిన ఆయన వివిధ బహుళజాతి సంస్థల్లో సీనియర్ మేనేజర్‌గా పని చేశారు. ఆయన ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు.
ఈ పుస్తకం గురించి జితేంద్ర జైన్ గారి ఒక మాట!
“ మీరు ఆనందంగా లేదా దుఃఖంగా ఉండేది కేవలం మీ ఎంపిక ద్వారానే అన్న సత్యాన్ని మీరు అర్ధం చేసుకుంటే, అప్పుడిక మీ ఎంపికలను స్పృహతో చేస్తుకుంటున్నారా లేదా స్పృహలో లేకుండా చేస్తుకుంటున్నారా అన్నదే మీరు ఆలోచించవలిసిన ప్రశ్న అవుతుంది.మీకిది అవగాహన అయినప్పుడు, అంటే మీ జీవితంలో బాధను సృష్టిస్తున్నది మీరే కాని, ఇతరులు కాదన్న విషయం మీకు అర్ధమైనప్పుడు, బాధను సృష్టించుకోవడం మీరు తప్పకుండా ఆపుతారు.”
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి ఈ మాటలు ఆనందం పట్ల నా అవగాహనను పూర్తిగా మార్చివేసాయి. అప్పటివరకు ఆనందం పట్ల నాకు చాలా భ్రమలు ఉండేవి(ఇప్పటికీ ఉన్నాయి), కానీ ఆనందం పట్ల ఆయన ఆలోచనలు తెలుసుకుంటూ ఆయనతో గడిపిన రెండు రోజులు నాకొక కొత్త ప్రపంచాన్ని చూపించాయి.
సద్గురుని " చీకటిని పారద్రోలే ఒక 'గురువు' గా లేదా నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని విధంగా ఆనందాన్నిఒక కొత్త కోణంలో అనుభవించడానికి సహాయడిన ఒక "శక్తిగా" ప్రస్తావించడానికి ముందు, నేను ఆయన గురించి ఒక "వ్యక్తి"గా మాట్లాడాలనుకుంటున్నాను.
ఒక వ్యక్తిగా ఆయన ఎంతో ఆనందమయ వ్యక్తి. ఆయన ఏమి చేసినా 1౦౦% ఈ క్షణంలోనే ఉంటారు. తను చేసే ప్రతి దానిలో పూర్తి తీక్షణతతో, నిమగ్నమై ఉంటారు. ఎంతో అద్భుతంగా కథలు చెప్పే ఆయన, ఇంకా అద్భుతంగా చతురోక్తులు వేయగలడు. చాలా ప్రసిద్ధి చెందిన తన పిట్ట కథలతో ప్రగాఢ సిద్ధంతాలను కూడా అత్యంత సులభంగా, స్పష్టంగా తెలియజేస్తారు. ఫ్రిస్బీల దగ్గర మొదలు పెట్టి, పుస్తకాలు, BMW బైకులు, రాజకీయాల వరకు ఏ విషయాల మీద అయినా చర్చించగల అమోఘమయిన వ్యక్తి ఆయన. తను మాట్లాడే ప్రతి విషయం మీద చాలా స్పష్టత గల వ్యక్తి ఆయన. ఎంతో సంక్లిష్ట విషయాలను కూడా ఆయన చాలా సరళంగా వివరించగలరు. మాటలతో ఆయనకు ఉన్నచాకచక్యం, ప్రగాఢ భావనలను కూడా అందరూ అర్ధం చేసుకునే విధంగా చెప్పగల ఆయన సామర్ధ్యం శ్రోతలకి వరప్రసాదాలు.
ఒక వ్యక్తిగా, సద్గురు చాలా సరదాగా ఉంటారు. ఓ ఫ్రిస్బీని ఒదిలి 20 మంది దానిని పట్టుకోవటానికి పరిగెత్తేలా చేసినప్పుడు ఆయనలోని తీక్షణతను గమనించండి. ఆయన నమ్రతకు నిలువెత్తు రూపం, ఆయన తన స్వహస్తాలతో మీకు భోజనం వడ్డిస్తున్నప్పుడు, మీరు అది ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు, కేవలం మీతోనే మాట్లాడతారు. తన మార్నింగ్ నడక గురించి మాట్లాడుతున్నంత తేలికగా ఆయన తన అత్యంత అద్భుతమైన విజయాల గురించి మాట్లాడుతారు.
ఒక వ్యక్తిగా సద్గురులోని ఈ అంశాలు నాకు స్ఫూర్తిని, ఆనందాన్ని కలిగిస్తాయి. సద్గురులో నాకు కనిపించే మానవాతీత కోణం ఆనందమే!
ఈ పుస్తకం ఆనందం కోసం చేసే ఒక ప్రయాణం.
ఇది ఒక గైడ్ బుక్ కాదు. ఇది “ ఎలా చేయాలి” అనే దానిని వివరించే పుస్తకం కాదు. ఇది మీకు "ఆనందానికి ఒక తక్షణ ఫార్ములా”ని ఇవ్వదు. అందుకు విరుద్ధంగా, ఇది నన్ను చేసినట్లే మిమ్మల్ని కూడా ఆనందం కోసం పరితపించేటట్లు చేస్తుంది. ఇది మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకుని పద్ధతిని మార్చేస్తుంది.
ఈ పుస్తకాన్ని "నేను" వ్రాయలేదు. ప్రపంచంలోని మీ వంటి ఎంతో మందితో నాలోని ఆనందాన్ని పంచుకోవాలని కోరుకున్నాను. నా ఆకాంక్షకు అనుగుణంగా, సద్గురు ఆనందం గురించి మాట్లాడిన మాటలకు నేను ఒక మాధ్యమాన్ని అయ్యాను, అంతే! అందుకు నేను అదృష్టవంతుడిని. ఈ పుస్తకంలోని దేవ్, లీల, ఆర్యల పాత్రలతో సృష్టించిన కధలు నేను వ్రాసినవే. ప్రతి అధ్యాయంలో ఆనందం గురించి సద్గురు మాట్లాడిన మాటలు ఆయన పేరుతో మొదలవుతాయి.
మీ పరిస్థితులు ఏమైనప్పటికీ, ఈ సృష్టి అందించే అంతులేని ఆనందాన్ని మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. అది మీ జన్మ హక్కు. అది పొందడానికి మీరు చేయవల్సినదల్లా మీరు దాన్ని వెతకడానికి సుముఖంగా ఉండటమే.
వాస్తవానికి, మీకు ఆనందాన్ని వెతకటం తప్ప వేరే మార్గం లేనే లేదు. ఆనందాన్ని ఎంచుకోవటం తప్ప వేరే దారి లేనే లేదు.
ఆనందం ఎల్లప్పుడూ మీతో ఉండు గాక!
-జితేంద్ర జైన్
- Author: Sadhguru
- Publisher: JAICO (New Edition)
- Pages: 135 Pages
- Language: Telugu