Jeena Haito Marna Seekho (George Reddy) By Katyayani (Telugu) - 2016
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
జార్జిరెడ్డి సునిశితమైన మేధ, సామాజిక మార్పుకై అంతులేని తపన, కఠినమైన క్రమశిక్షణ, ఆర్ద్రమైన హృదయం, అవధులు లేని సాహసం. ఇవన్నీ కలబోసిన పాతికేళ్ళ యువకుడు. అరవయ్యవ దశకం చివరి నుండి డెబ్బయ్యవ దశకం తొలి రోజుల దాకా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జి నిర్మించిన ఉద్యమం విలక్షణమైనది. అది, భారతదేశంలో బలపడుతున్న విప్లవ చైతన్యాన్ని విద్యార్థి ఉద్యమంలో ప్రవేశపెట్టడానికి జరిగిన తొలి ప్రయత్నం. క్యాంపస్ పై పెత్తనం సాగిస్తుండిన ఫ్యూడల్ శక్తులపై రాజీలేని పోరాటం చేస్తూ ప్రాణాలర్పించాడు జార్జి. తన పోరాట క్రమంలో జార్జి నెలకొల్పిన విలువలూ, ప్రజాస్వామిక చైతన్యమూ ప్రత్యేకమైనవి. ఆయన జీవితాన్నీ, ఉద్యమాన్నీ గురించి జార్జి బంధువులూ, సహచరులూ కలబోసుకున్న జ్ఞాపకాల ఆధారంగా, అతడి వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.
- Author: Katyayani
- Publisher: Hyderabad Book Trust
- Paperback: 110 pages
- Languages: Telugu