Cricket Everest Sachin Tendulkar (Telugu)
క్రీడాకారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే తన ఆటతీరు, నడవడిక, విలక్షణ వ్యక్తిత్వం, అనితర సాధ్యమైన రికార్డులతో కొన్ని తరాలకు అంతులేని ఆనందం కలిగించిన ఆటగాడు సచిన్ రమేశ్ టెండుల్కర్. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా 24 సంవత్సరాల పాటు 600కు పైగా మ్యాచ్‌లు ఆడి... డజన్ల కొద్దీ ప్రపంచ రికార్డులతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మొనగాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారి అభిమానం సంపాదించుకొని... యువతలో స్పూర్తి నింపిన క్రికెట్ ఎవరెస్ట్, 'భారతరత్నం సచిన్‌కు సంబంధించిన సమగ్ర విశేషాలతో వెలువడుతున్న ఈ అరుదైన పుస్తకంలో నేనూ భాగస్వామిగా ఉండడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 1984లో నేను పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభిస్తే, 1988లో సచిన్ క్రికెట్ జీవితం ప్రారంభమయ్యింది. ఆ రోజు నుంచి సచిన్ రిటైర్మెంట్ రోజు వరకూ ఈ మహా క్రికెటర్ ఆటలోని సొగసును, వ్యక్తిగా అతని సుగుణాలను ఆస్వాదిస్తూ... ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌గా వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు రాసే అవకాశం, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడాన్ని మించిన గౌరవం మరొకటి లేదని గర్వంగా, సవినయంగా చెబుతున్నాను.
-
Author: Chopparapu Krishna Rao
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 150 Pages
- Language: Telugu