Cinemalu Manavi Vaalavi (Telugu)
ఈ పుస్తకంలోని వ్యాసాలను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో రే అప్పటి భారత దేశ సినిమా పరిస్థితిని, సినిమా తీయడంలో దర్శకునిగా తన అనుభవాలని, కష్టాలని వెల్లడి చేస్తాడు. రెండో భాగంలో ప్రపంచ సినిమా పోకడలని, ఆయన సమకాలికులైన కురొసవ, చాప్లిన్ వంటి ప్రముఖుల గురించి తన అభిప్రాయాలను వివరిస్తాడు. మొదటి సగంలో ఎంతో అనుభవంతో విశ్లేషించే గురువులా కనిపిస్తే, రెండొవ సగంలో ఎంతో వినమ్రుడైన విద్యార్థిలా అగుపిస్తాడు. ఇదే ఆయన రచన శైలిలో ఉన్న ప్రత్యేకత. ఎంతటి గొప్పవాళ్ళైనా నిష్కర్షగా విమర్శిస్తూ, సినిమా చరిత్రలో మైలురాళ్ళు అనదగిన వ్యక్తులను, సంఘటనలు వివరిస్తూ సాగుతుందీ పుస్తకం. ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసాలలో చిత్ర నిర్మాణ పరిస్థితులను, సినిమా పరిభాషను గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఈ నాటికీ సినిమా వ్యవస్థ ఏ మాత్రం మారలేదని అర్థం అవుతుంది. మూకీ చిత్రాల నుంచి శబ్దచిత్రాలకు జరిగిన మార్పులలో శబ్దప్రాధాన్యత పెరిగి, దృశ్య ప్రాధాన్యత తగ్గిందని వాపోయినా, "స్టార్" నటుల కోసం కథలలో మార్పులు చేస్తున్నారని బాధపడినా, యూనియన్ విధానంపై వ్యంగ్యాస్త్రాలు వేసినా, స్టూడియో భారీ బడ్జెట్ సినిమాల పరాజయాల గురించి మాట్లడినా, అన్నీ ఈ నాటికీ వాస్తవాలుగా కనిపించి ఆశ్చర్యపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి.
-
Author: Satyajit Ray
- Publisher: Anvikshiki Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu