C/o Bawarchi Perfect Paperback – 1 January 2022
Sale price
₹ 170.00
Regular price
₹ 200.00
C/o Bawarchi Perfect Paperback – 1 January 2022
చరణ్ కథలు కొన్ని రంగులతో, గీతలతో మొదలవుతాయేమో! అట్లా కొన్ని రంగులూ, గీతలూ వాక్యాల్లోకి ప్రవహిస్తాయి. పాత్రలుగా ఆకారం దిద్దుకుంటాయి. చరణ్ కాసేపు ఇంప్రెషనిస్ట్, ఇంకాసేపు సర్రియలిస్ట్. కానీ, అతని రంగులూ, గీతలూ మాత్రం నిజానికి రియలిజంలో ఊహలు నేర్చుకుంటాయి. తరవాత చదువుదామని వాయిదా వేసుకుంటూ మొదలు పెడితే, వొక్కో కథా నిలువెత్తు కాన్వాస్ గా మారి, దారికి అడ్డం పడుతుంది. నిలదీసి మరీ తన లోతు కనుక్కోమంటుంది. నాకు తెలిసీ హైదరాబాద్ నగరానికి ఇంతకంటే ఆత్మీయమైన మరో కథకుడు ఉండడేమో! చరణ్ పరిమి అచ్చంగా మెట్రో కథకుడు. స్వచ్ఛంగా కాస్మోపోలిటన్ నగర నివాసి. తనచే సృష్టింపబడిన మనుషులూ, సన్నివేశాలూ మనం రోజూ చూసేవాళ్లే. కానీ, చరణ్ వర్ణరేఖా సమ్మేళనంలో వాళ్ళని కొత్తగా పరిచయం చేసుకుంటాం. - అఫ్సర్ రచయిత, సంపాదకులు
-
Author: Charan Parimi
- Publisher: Anvikshiki Books (1 January 2022)
-
Paperback: 156 Pages
- Language: Telugu