Bharatha Jaathi Punarujjivam (Telugu)
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
1870ల నుండి ప్రారంభమైన జాతీయ పునరుజ్జీవన దశ నుండి, ఈనాటికి కాలం చాలా మారిపోయింది. తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినై. అన్నీ సామాజిక సమానతావసరాన్ని పురస్కరించుకునే వచ్చినై. తమ ప్రయోజనాల్ని ఏదో ఒక మేరకు నెరవేర్చినై. ఐతే, 1990లో ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుండి, అన్ని వాదాలు, అన్ని ఉద్యమాలు, భయపడవలసిన పరిస్ధితులు వచ్చినై. పూర్వపు పుస్తకాలు చదువుతుంటే, వారి ఆవేదన అర్థమౌతుంది; వారి ఆలోచనలు అవగతమౌతై. ఈ మార్పులకు ఆశ్చర్యమూ, ఆవేదన, తట్టుకోలేనంత ఆగ్రహ విషాదాలు కలుగుతై. అటువంటి వాటిలో సి.వి. రాసిన 'భారత జాతి పునరుజ్జీవనం' ఒకటి.
ఈ పుస్తకంలో మన సమాజంలోని దురాచారాలు, వాటి పరిణామాలు, సంస్కరణకు పూనుకుని సమాజాన్ని మార్చిన మహనీయులు, చారిత్రికాంశాలు మొదలైన వాటిలో ప్రధానమైన వాటిని, సి.వి. చర్చించారు. అంతేగాక తన వైముఖ్యాన్ని అతి తీవ్రమైన శైలిలో చెప్పారు.
-
Author: C.V.
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
- Paperback:
- Language: Telugu