Bala Bhaktulu (Telugu)
కేరళ దేశంలో కాలడి అనే చిన్న అగ్రహారం. ఎన్నోవందల సంవత్సరాల క్రితం ఆ పల్లెలో శివగురు, ఆర్యాంబ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు అమిత దైవభక్తి పరాయణులు. చక్కని పాండిత్యం గల శివగురు సర్వ శాస్త్ర పారంగతుడుగా విఖ్యాతి పొందాడు. వారికి అన్ని సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించినా పుత్రసంతానప్రాప్తి మాత్రం కలుగలేదు. వారు భక్తి ప్రపత్తులతో ఉపవాస వ్రతాలు చేసి పుత్రప్రాప్తికై పరమేశ్వరుని ప్రార్థించసాగారు. ఒకనాటి రాత్రి పరమేశ్వరుడు శివగురు కలలో కనిపించి, ‘నాయనా! నీ పట్ల నేను సంప్రీతుడనై ఉన్నాను. నీకు సకల విద్యా పారంగతుడు, సర్వజ్ఞుడు అయి, పదహారేళ్ళు మాత్రం జీవించగల సత్పుత్రుడు కావాలా, లేక దీర్ఘాయుష్మంతుడైన సామాన్యుడైన పుత్రుడు కావాలా? కోరుకో! ప్రసాదిస్తాను’ అన్నాడు.
కొన్ని క్షణాలు ఆలోచించాడు శివగురు. తర్వాత ఇలా అన్నాడు: ’అల్పాయుష్కుడైనా నాకు సర్వజ్ఞుడైన సుపుత్రుడినే ప్రసాదించు దేవా! శివగురు జవాబు విని పరమేశ్వరుడు ప్రమోదంతో, ’నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తాను’ అంటూ అంతర్ధానమయ్యాడు. శివగురు సంతోషానికి అవధులు లేవు.
-
Author: Swami jnandananda
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback: 63 Pages
- Language: Telugu