Bahumukham (Telugu) - 2014
డా. కె.కె.రంగనాథాచార్యులు వివిధ సందర్భాలలో, మాధ్యమాలలో వెలువరించిన వ్యాసాల సంకలనం ఇది. సమకాలంలో వస్తున్న భాషా సాహిత్య విమర్శ వ్యాసాలకివి విభిన్నంగా కనిపిస్తాయి. సమకాలిక విమర్శలో అరుదుగా కనిపించే సూక్ష్మపరిశీలన, సూటిదనం ఈ వ్యాసాల లక్షణాలు. బహుముఖీనమైన పరిజ్ఞానం, అధ్యయనం వ్యాసాలలో ప్రతిఫలిస్తాయి. చారిత్రక దృష్టి, సామాజిక దృక్పథం వ్యాసాలకు ప్రాసంగికతను కల్పిస్తాయి.
సంకలనంలోని వ్యాసాలు పీఠికలు కేవలం ఔపచారిక రచనలు కావు. వాటికి ఎత్తుగడ మొదలుకొని విషయ వివేచన వరకు ఒక సమగ్రతా లక్షణం ఉంది. విషయ సమగ్రత, శైలీ సాంద్రత, వివిధ కోణాలలో విశ్లేషణ వ్యాసాల ముఖ్యలక్షణాలు. పీఠికా రచనలో కూడా గ్రంథ సూక్ష్మపరిశీలన కనిపిస్తుంది. విషయవైపుల్యమూ, వైశద్యమూ, నైశిత్యమూ పీఠికల్లో వ్యక్తమవుతాయి. సాధారణంగా అలవోకగా సాగుతాయనుకునే రేడియో ప్రసంగవ్యాసాల్లో కూడా విషయగాఢత కనిపిస్తుంది.
- Author: K.K. Ranganadha Charyulu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 392 pages
- Language: Telugu