Antarani Vasantam Paperback – 1 January 2021
Antarani Vasantam Paperback – 1 January 2021
అంటరాని వసంతం' నవలకు యిరవై వసంతాలు నిండిన సందర్భంలో... జాతీయంగా, అంతర్జాతీయంగా నవలని తమ గుండెల్లో దాచుకొన్న అశేష పాఠకలోకానికి విలువైన విమర్శలు, విశ్లేషణలు చేసిన విమర్శకులకు, విశ్లేషకులకు నవల మీద ఎన్నో సభలు, చర్చావేదికలు, డేలాంగ్ సెషన్స్ నిర్వహించిన అంటరాని వసంతం అభిమానులకు విశ్వవిద్యాలయాలలో నవల మీద "ఎంఫిల్”లు, "పిహెచ్ డి”లు చేసిన రిసెర్చి స్కాలర్సుకు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో అనువాదం చేసిన అనువాదకులకు యింకో ఆరు భాషల్లో అనువాదం పనిలోవున్న అనువాదకులకు...ప్రతిభాషలో చక్కగా ప్రచురిస్తున్న ప్రచురణకర్తలకు... విప్లవాభివందనాలు. నా చిన్నతనంలో ఎన్నో అందమైన కథలు అల్లి నాకు చెప్పి అంటరాని వసంతానికి శిల్పాన్ని, శైలిని యిచ్చిన మా అమ్మమ్మ గుర్తోస్తోంది యిప్పుడు. నిజంగా మా అమ్మమ్మ ఓ అందమైన అల్లిక వారస్వతం. ఓ అద్భుతమైన జ్ఞాపకం. నవలలో జ్ఞాపకం గతం కాదంటుంది. రూతు. అదో అంటరాని వసంతమంటుంది. ఆ వసంతానికి కొసమెరుపు లేదు. వున్నదల్లా కొనసాగింపే... ఆటలా... పాటలా... కవితలా... కథలా... జ్ఞాపకాలు... వాస్తవాలు. నిన్న తన పూర్వికులు చేసిన యుద్ధం తాలూకూ జ్ఞాపకాలు. ఈ రోజు తన బిడ్డలు చేస్తున్న యుద్ధం తాలూకూ వాస్తవాలు. ఆ జ్ఞాపకాల, వాస్తవాల నడకే నా రచన. అంతా ఓ నడక. నా నడకకి చేయూత నా అమృత... నా సహచరి... బతుకులో... రచనలో.... - జి. కళ్యాణరావు
- Author: G Kalyan Rao
- Publisher: Anvikshiki Publishers (1 January 2022)
- Language: Telugu