Adavi Shanthi Sri (Telugu) - 2015 - Chirukaanuka

Adavi Shanthi Sri (Telugu) - 2015

Sale price ₹ 129.00 Regular price ₹ 135.00

ఏనాటి కాంతవు! యుగయుగాల నుండి గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునాబ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ, గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈనాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీరగర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి. నీది రతనాలబొజ్జ.
కృష్ణవేణీ! నీలనదీ! ప్రేమమరూ! అనేకాంధ్ర సార్వభౌమ సహచరీ! ఆంధ్రాంగనా! నీవు నీలవవుషవై, లోకానికి నిత్యత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటావు. నీవు నిర్మలాంగివై, నిత్యసృష్టిని లోకానికి పాటపాడి వినిపిస్తూ ఉంటావు. ప్రతియామినీ నీరవఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు పలుకుతూ ఉంటావు. నీవు ఆంధ్ర వసుంధరానీలమేఖలవు.
-----
చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడివి బాపిరాజు గొప్ప భావుకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకతకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.

  • Author: Adavi Bapiraju
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 272 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out