Sowgandhi (Telugu) Paperback - 2000
సౌగంధి పల్లెటూరి అమ్మాయి. బావ వత్సల్ అంటే అమితమైన ప్రేమే. పట్నంలో ఉన్న జ్వాలా,సుదేష్ణల బోధనలతో స్వతంత్రంగా బతకాలనుకుంటుంది. అలా అనుకుంటుంటన్న సమయంలో వత్సల్ తో పెళ్లి జరిపించడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోతాయి. రేపు పెళ్లనగా తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని వత్సల్ కు చెప్పేస్తుంది. తప్పు తనవైపున ఉండేలా వత్సలే సడన్ గా పెళ్లి ఇప్పుడు వద్దని చెబుతాడు. పల్లెను వదిలి పట్నం వచ్చిన అమ్మాయి నిజగానే తన కాళ్లపై తాను నిలబడుతుంది. కానీ… పట్నపు మనుష్యుల మోసాలలోంచి బయటకు వస్తుందా? వ్యాపారాభివృద్ధిలో బాగంగా నమ్మిన వినోద్, జ్వాలాలు మోసం చెస్తే చివరకు ఎలా బయట పడింది. అమితంగా ప్రేమించిన వత్సల్ ని చివరకు పెళ్లచేసుకుందా… అడుగడుగునా మలుపులు తిరుగుతూ… పట్నపు వాసపు బతుకులను, పల్లెబతుకులను కళ్లకు కట్టిన చిత్రిస్తూ సాగిన నవలా దేశపు రాణి యద్ధనపూడి సులోచనరాణి గారి కలం నుండి వెలువడిన అద్భుతమైన నవలా సౌగంధి.
చదవండి! చదివించండి!!
- Author: Yaddanapodi Sulochanarani
- Paperback: 200 Pages
- Publisher: Emesco Books (Latest Edition: 2011)
- Language: Telugu