Poolu Parachina Baata (Telugu) Perfect Paperback - 2015 - Chirukaanuka

Poolu Parachina Baata (Telugu) Perfect Paperback - 2015

Sale price ₹ 65.00 Regular price ₹ 75.00

ఈ ‘పూలు పరచిన బాట’ ఒక తాజాపూలగుత్తి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ద స్పీకింగ్‌ ట్రీ కాలమ్‌ కోసం సద్గురు రాసిన వ్యాసాల సమాహారమిది. సంక్షోభంతోనూ, రోజువారీ జీవితపు విసుగుతోనూ నిండిపోయిన అసంఖ్యాక జీవితాల్లో ఈ వ్యాసాలు ఎన్నో ఏళ్లపాటు సౌందర్యాన్నీ, స్పష్టతనీ, ఉల్లాసాన్నీ, వివేకాన్నీ కుమ్మరిస్తూవచ్చాయి. అంతర్జాతీయ వార్తలతోనూ, స్టాక్‌మార్కెట్‌ ఊహాగానాలతోనూ కిక్కిరిసిపోయే వార్తాపత్రిక పేజీల మధ్య ఈ వ్యాసాలు అనూహ్యమైన అంతర్దృష్టితో, నిశ్చలత్వంతో కనిపించి పాఠకుల్ని చకితుల్ని చేసాయి.
పూలలానే ఈ వ్యాసాలు కూడా పాఠకుల ప్రత్యూషాల్ని కొన్నింటిని పరిమళభరితం చేసాయి. మరికొన్ని ప్రభాతాలు వారిని నిద్దురలేపి, కాలం చెల్లిన భావాల్నీ, విశ్వాసాల్నీ వారి ప్రాంగణం నుంచి ఊడ్చేశాయి.

  • Author: Sadguru Jaggi Vasudev
  • Perfect Paperback: 128 pages
  • Publisher: Emesco Books; Latest edition (2 September 2015)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out