Oka Koyila Gunde Chappudu (Telugu)
'ఒక కోయిల గుండె చప్పుడు'' కథా సంపుటిలో కథలు స్త్రీల ఆశలను, ఆశయాలను, కోరికలను, ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తాయి. స్త్రీ హృదయ లోతుల్లో దాగివున్న ఎన్నో బాధలను, ఆవేదనలను కూడా మన కళ్ళముందు ఆవ్కిరిస్తాయి. అలా అని ఈ స్త్రీలంతా సమస్యలను చూసి పారిపోరు. కష్టాలకు కృంగిపోరు. కన్నీళ్ళు కారుస్తూ ఇంతే నా రాత అని సర్దుకుపోరు.
జీవితంలో పరుగులు పెడుతూ, ఎదురుతిరిగి నిలబడి ప్రశ్నిస్తారు. సున్నితంగానే అయిష్టాలను తిరస్కరిస్తారు. తనకు తారసపడిన అనేకమంది స్త్రీల మనోభావాలను తన కలంతో అందంగా, అద్భుతంగా చిత్రించి స్త్రీ ఔన్నత్యంలో మనకు తెలియని కోణాలను చూపించారు అత్తలూరి విజయలక్ష్మి ఈ కథలలో.
చైతన్యం తొణికిసలాడే పాత్రలలో, అద్భుతమైన సన్నివేశాలతో, ఆసక్తికరమైన సంభాషణలతో అనేక రకాల జీవితాలను ఒకే కాన్వాస్ మీద చిత్రించి, ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా చదివింపజేసే కథలు... వీటిలోని ప్రతి సంఘటనా పాఠకుల మదిని తడుతుంది. ప్రతి పాత్రా పలకరిస్తుంది. కలిసి ప్రయాణం చేస్తుంది.
- Author: Athuluri Vijaya Laxmi
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 167 Pages
- Language: Telugu