Galikondapuram Railway Gate (Telugu) Paperback - 2007
Sale price
₹ 99.00
Regular price
₹ 100.00
మహారణ్యంలో చాలా ఎత్తయిన కొండల సమూహం మధ్యలోవున్న ఆ చిన్న స్టేషను పేరు గాలికొండపురం రైల్వేగేటు. స్టేషనుకి దిగువగా వుంది ఊరు. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వచ్చే రైళ్ళేమీ లేకపోవడంతో నిశ్శబ్దంగా వుందా ప్రాంతం. చేతితో తాకితే చీకటి పొడి రాలుతుందా అనిపించేటంతటి కటిక చీకటి. నిద్రపోని రుషిపక్షుల అరుపులు. ప్రేతాత్మగొంతులా ఎత్తయిన గాలికొండ మీంచి సుళ్ళు తిరుగుతూ వీస్తున్న గాలులు. ఎదుటి మనిషి స్పష్టంగా కన్పించనంత దట్టంగా మూసుకుపోయిన మంచు. కేన్సర్‌లా నరాలు కొరుకుతున్న చలికి మెలికలు తిరుగుతున్న ప్రకృతి కన్య, చీకటి దుప్పటి నిలువునా కప్పుకుంది. గడ్డ కట్టిన ఆ అందంలో చాలా పొద్దు గడిచింది. హఠాత్తుగా శబ్దాలు...
- Author: Vamsi
- Publisher: Emesco Books (2007)
- Language: Telugu