Bala Vikasam (Telugu)

Bala Vikasam (Telugu)

Regular price ₹ 110.00

బాల్యం, మరపురాని మరచిపోలేని ఒక తీయని జ్ఞాపకం. మరలా ఒక అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ అనుభవించాలి అనుకునే దశ. ఎన్నో అనుభూతులను నిక్షిప్తం చేసుకున్న బాల్యదశ అందరికీ అన్నీ ఇవ్వదు. ఇప్పటి రోజుల్లోని పిల్లల జీవితాలను ఒక్కసారి పోల్చిచూస్తే మనం పొందినది వారు పొందలేనిది అని అనేక తేడాలు కనిపిస్తాయి. మనం చేతులతో తాకి అనుభవించిన ఆనందాలు ఇప్పటి పిల్లలకు టీవీలలోనో, పుస్తకాలలోనో కనపడుతున్నాయి. ఎన్నో ఆశలను, ఆశయాలను జత చేయాల్సిన బాల్యదశ ఇప్పటి పిల్లలలో కొందరికి ఒక చేదు జ్ఞాపకంగా మారుతోంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పడంలో నాకు ఏ తప్పూ కనబడడం లేదు.ఆనందంగా అమ్మానాన్నల ఒడిలో పెరగాల్సిన పిల్లలు ఒంటరిగా, అనాథలలా వీధులలో కనబడుతున్నారు. అందరూ ఉన్న మరి కొందరు ఎవరూ లేని ఏకాకిగా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగానే బ్రతకాలనుకుంటున్నారు. మానవీయ విలువల మధ్య, ఆప్యాయతానురాగాల మధ్య, ఆనందంగా ఆహ్లాదంగా సాగాల్సిన పిల్లల జీవితాలు మోడుబారి మొగ్గలోనే వాడిపోతున్నాయి. మరి ముందుకు ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి…? అని చూసిన నాకు కొన్ని అనుభవాలు జ్ఞప్తికి వచ్చాయి.

  • Author: Girindar Alwal
  • Publisher: Provess Publishers
  • Languages: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out