Adari Bathukulu Pallekathalu (Telugu) - 2019
మదనపల్లికి కొద్ది దూరంలో వుండేఒక మాదిగ పల్లె బిడ్డ. కేవం ఐదో తరగతి వరకేచదివింది భారతి. కానీ జీవితాన్ని లోతుగా చదివింది.అనుభవాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి చదువేమీ అక్కర్లేదు. పెద్ద చదువు చదివిన కథకులు చాలామంది రాయని, రాయలేని అద్భుతమైన కథలామె రాసింది. చిత్తూరు జిల్లా జీవభాష తొణికిసలాడుతూ వుంది ఆమె చేతిలో. గొడ్డుతునకు, గంగవ్వ పోసే మజ్జిగ, పూపెట్టగుడ్లు, ఒకటా రెండా ఎన్నో కథలు. పూలపెట్ట కథచదివి కడుపారా నవ్వుకున్న. ముగింపు చదివికన్నీరు కార్చా. అలాగే, కోడలికి తిండి సరిగా పెట్టని అత్త కథ చదివి కదిలిపోయా. కథను చెప్పాలి. దృశ్యాన్ని వర్ణించి, సంభాషణు రాసి సినిమా స్క్రీన్ ప్లే నారేషన్ తపించే కథలు రాసే వాళ్లు చాలా మంది మనకున్నారు. ఉత్తమ కథ ప్రమాణాకుగానీ ప్రమాణాకు విరుద్దంగా నవీన విధానంలో చేసే విశ్లేషణకు గానీ నిలబడనివి చాలానే వచ్చాయి. కానీ భారతి ఏ విశేషణాలకు అందని నిఖార్సైన కథకురాలు. వాస్తవికత, కళాత్మకత, తాత్వికత, గాఢత, చలనశీలత గుణాు పుష్కలంగా వున్న కథలివి. ఈ కథలు చదివి మీరే జడ్జిమెంట్ ఇవ్వండి.
- Author: Andavalli Bharathi
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 120 Pages
- Language: Telugu