Gatitarkika Bhoutikavadam (Telugu)
సమాజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రిక భౌతికవాదం ఆ సైన్స్. ప్రఖ్యాత మార్కి ్సస్టు మేధావి మారిస్ కార్న్ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్కి ్సస్టు తత్వశాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్పటి నుండి ఎన్నెన్నో ముద్రణలు పొందుతూ ఆదరణ పొందుతున్న గ్రంథం ఇది. సాధారణంగా తత్వశాస్త్ర గ్రంథాలలో ఎదురయ్యే సాంకేతిక పదజాలం లేకుండా, విషయాన్ని సరళంగా సుబోధకంగా వివరించడం ఈ గ్రంథం విశిష్టత. ఆయా సాంకేతిక పదజాలం వచ్చిన చోట వాటిని నేరుగా కాకుండా వివరణల ద్వారా ఈ గ్రంథం తెలియ చేస్తుంది. ఆరు దశాబ్దాలకు పైగా మార్కి ్సస్టులకు కరదీపికగా ఉన్న ఈ గ్రంథం ప్రాధాన్యత ఇప్పటికి చెక్కుచెదరనిది.
-
Author: Marin Cornfore
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu