Nastikatvam Avasyakatha (Telugu)
Regular price
₹ 45.00
సాంఘిక విప్లవకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా, ఆచరణాత్మకంగా ప్రజల ముందు పెట్టిన గోరా 1940లో ప్రపంచంలోనే ప్రప్రథమ నాస్తికకేంద్రాన్ని సరస్వతీగోరాతో కలిసి ప్రారంభించారు.
నాస్తికత్వం కేవలం సిద్దాంత చర్చ మాత్రమే కాదనీ, కుల, మత రహిత సెక్యులర్ సమాజ నిర్మాణానికి నాస్తికత్వం వచ్చినంత మాత్రాన చాలదని, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం సాధనకు నిరంతరం కృషి జరగాలని, మనిషిలో ఉన్న పరాధీన ప్రవృత్తిని పారద్రోలి, స్వశక్తి విశ్వాసాన్ని పెంపొందించాలని, గోరా స్పష్టంగా చెప్పారు. మనిషిలో నిహితమై ఉన్న శక్తి సామర్థ్యాలను, కర్తృత్వశక్తిని పెంపొందించాలని, కాలం చెల్లిన పాతభావాలను, మూఢనమ్మకాలను పారద్రోలడానికి నాస్తికత్వం అత్యవసరమని గోరా కృషి కొనసాగించారు.
-
Author: Gora
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 40 Pages
- Language: Telugu