Daivamto Sahajevanam (Telugu)
మానవజన్మకు పరమార్థం ఆత్మసాక్షాత్కారం. మానవజన్మ, ముముక్షత్వము, మహాపురుష సాంగత్యము ఈ మూడు ఏకకాలంలో సంభవించుట దుర్లభము. ఏ వ్యక్తికి ఈ మూడు ఏక కాలంలో లభించినవో వారు పరుసవేదిని తాకిన ఇనుము బంగారముగా మారిన చందమున ఒక అవతారపురుషుని ప్రాపు లభించిన వారు అచిరకాలములోనే మహాత్ములు కాగలరు. అటువంటి అవతార పురుషులు శ్రీరామకృష్ణ పరమహంస అయితే ఆ మహాపురుషులు శ్రీరామకృష్ణులవారి సన్న్యాస శిష్యులు. దైవంతో సహజీవనం అనే ఈ గ్రంథంలో శ్రీరామకృష్ణులవారి పదిహేనుమంది సన్న్యాస శిష్యుల జీవిత చరిత్రలు పొందుపరచబడ్డాయి. శ్రీరామకృష్ణులవారి శిష్యులు గురుదేవుల పట్ల చూపిన అచంచల భక్తి విశ్వాసాలు, పరస్పరం ఒకరిపై మరొకరికి గల ప్రేమాదరణలు, వారి పవిత్రత, వైరాగ్యం, వారి శిక్షణ, తపోమయ జీవనం, భగవంతునికై వారు పడిన వ్యాకులత, వారి సత్యసంధత, ఆత్మ సంయమనాన్ని తేటతెల్లని రీతిలో గ్రంథరచయిత స్పష్టం గావించారు. సాధకులు తప్పక చదువవలసిన స్ఫూర్తిదాయక పుస్తకం.
-
Author: Swami Chethanananda
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback: 816 Pages
- Language: Telugu