Pillala Bommala Maryada Ramanna Kathalu (Telugu)
''మర్యాద రామన్న అంటే నువ్వేనా ? ఇంతకీ నేను చేసిన తప్పేమిటి ? నువ్వు నన్ను నిందించావట. కారణమేమిటి ?'' అని అడిగాడు రాజు.
''మహారాజా ! ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే ఆ తప్పు పరిపాలించే రాజుకే చెందుతుంది. అలాగే ప్రజలు చేసే తప్పులకు కూడా రాజే బాధ్యులు'', అన్నాడు రామన్న. రాజు నవ్వి ''నువ్వు సరిగానే చెప్పావు. మా న్యాయమూర్తి చేసిన తప్పేమిటో చెప్పు, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను'' అని అన్నాడు రాజు చిరునవ్వుతో.
''మహారాజా ! దయచేసి జరిగిన సంఘటనకు సంబంధించి మరోసారి విచారణ జరిపించండి. మీ న్యాయమూర్తి ఆ ముసలమ్మకు అన్యాయం చేశాడు. పది మంది నేరస్తులు తప్పించుకు పోయినా పరవాలేదు. ఒక అమాయకుడికి కూడ శిక్షపకూడదని కదా ! పెద్దలంటారు''. రామన్న మాటలకు రాజు ఆనందించాడు. రామన్న తెలివయినవాడని నిర్ధారించుకోవటంతో పాటు అతని ధైర్యం చూసి రాజు ముగ్ధుడయ్యాడు.
''రామన్నా! నేను ఇంతకు ముందే నీ గురించి విని వున్నాను. ఈ తగాదాకు సంబంధించి నువ్వయితే ఎలాంటి తీర్పు ఇస్తావో చూడాలనుకుంటున్నాను ?'' అని రామన్నను అడిగాడు.
- Author: Reddy Raghavaiah
- Publisher: Swathi Book House (Sep-2019)
- Paperback: 32 pages
- Pictures Colour: Colour Pictures
- Languages: Telugu
- Ages: 0-10