Uttarandhra Kathalu (Telugu) Hardcover – 1 January 2013
Uttarandhra Kathalu (Telugu) Hardcover – 1 January 2013
"ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక కాలంలో తొలి నాళ్లలో ప్రగతి శీల సాహిత్యానికి నారు పెట్టి, నీరు పోసిన వైతాళికులు ఉత్తరాంధ్ర సాహితి వేత్తలే."
"ఈ సంకలనం అటు కళింగ సీమలో వికాసవంతమైన కొండ గాలులు పీల్చుకుంటూ, నాగావళి నది తరంగాలలో తేలుకుంటూ, విజయనగర కోట గుమ్మాలు దాటుకుంటూ యారాడ కొండంత ఎత్తులో నిలబడి చైతన్యం పుతికరించుకుని విశాఖ సముద్రం సాక్షిగా మీ ముందుకు వచ్చి మీ చేతి మీద వాలింది. మీ హృదయపు గదిలో చోటు కోసం.........."
"స్వాతంత్ర్యనంతర కాలంలో మానవ సంబందాలలోను, మానవ విలువలలోనూ జరుగుతున్న పరిణామాలను, రాజ్యము రాజ్య వ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ఉత్తరాంధ్ర కథలు ప్రతిభావంతముగా వెలుగులోకి తెస్తున్నాయి. తెలుగు కథ సాహిత్య వికాసంలో విశిష్టమైన పాత్ర ఉత్తరాంధ్ర కథలది."
"ఇందులో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంత నిర్దిష్ట జీవిత చిత్రణతో రచించిన కథలే కాకా ఈ ప్రాంతపు జీవిత చిత్రణ చేస్తూనే సార్వత్రికతను సంతరింప చేసుకున్న కథలూ ఉన్నాయి. కొన్ని కథలు ఏ ప్రాంత జీవితానికైన చెందిన విధంగా ఉన్నాయి. భౌగోళిక ప్రత్యేకలతో, సాంస్కృతిక వాతావరణంతో, జీవిత వాస్తవికతతో మత, వర్గ, లైంగిక శీలస్వభావ స్థాయి బేధాలతో, వయో భేదాల యాసలో సంభాషణలు రాసిన కథలు, కథను యావత్తు యాసలో రాసిన కథలు ఇందులో ఉన్నాయి."
"తెలుగు సాహిత్యంలో ఇతర ప్రక్రియలు సాధించలేని జీవిత వైవిధ్య చిత్రణను ఒక శతాబ్దిలోని తెలుగు కథ సాధించగలిగింది."
- Author: V Lakshmipathi garu
- Publisher: Visalaandhra Publications house
- Language: Telugu
- Hardcover: 1027 pages