Umar Khayyam (Telugu)
ఏది యెలాగైనా, రుబాయీల మొత్తంలో ఒక ముఖ్య సూత్రం గోచరిస్తుంది.
నీవు తాగిన మధుపాత్రా, నీవు ముద్దుపెట్టుకున్న పెదవులూ, నీ ప్రేయసీ కూడా, ఎప్పుడో ఒకప్పుడు మట్టిపాలు కావడం తప్పదు; కాలం కాళ్ళకింద నుంచి జారిపోతూ ఉంది; ఇదమిద్ధం అని తేల్చలేని సమస్యలను గురించి యోచనలతో జీవితాన్ని వృధాచేయక, అనుభవించగలిగిన ఆనందం అంతా అనుభవించు.
పుట్టనట్టి రేపు, గిట్టినట్టి నిన్న, వీటి తలపుల వృధా వేసట ఎందుకు, ఎదురుగా ఉన్న సుఖాన్ని వదలడమెందుకు; పొందగలిగిన ప్రస్తుతానందమంతా ఇప్పుడే చేజారిపోకముందే పొందు; ఎక్కడో ఎప్పుడో ఆనందాన్ని అనుభవిస్తాము అనే భ్రమలో, ఇప్పుడు ఇక్కడ లభ్యమైన ఆనందాన్ని ఒదులుకోవడం శుద్ధ తెలివితక్కువ; తరువాత స్వర్గంలో సుఖాన్నంతా అనుభవిస్తాము అన్నది ఉత్తభ్రమ. స్వర్గం ఎక్కడో లేదు.
చెట్టునీడుండి, రుచియైన రొట్టె ఉండి, దివ్యమైనట్టి శృంగార కావ్యముండి
పరవశము చేయగల మధుపాత్ర ఉండి, పాడుచును నీవు హాయిగా ప్రక్కనుండ,
వట్టి బయలున స్వర్గమే ఉట్టిపడును. -ఇదీ ఉమర్ ఖయ్యాం సందేశం.
- Author: Mudhu Krishna
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback:
- Language: Telugu