Telugulo Anuvada Vidhanam (Telugu)
అనువాదం ఎంత కష్టమో అనువాద సిద్ధాంతాలపై ఒక పుస్తకం రాయడమూ అంతే కష్టం. భిన్న భాషల గురించీ, భిన్న భాషల వ్యాకరణాల గురించీ ఎంత తెలిసినా ఈ ప్రయత్నానికి తక్కువే అవుతుంది. 'మందః కవియశః ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్' (నేను మందుణ్ణి. కానీ కవిగా కీర్తిని ఆశిస్తున్నాను. బహుశః అపహాస్యం పాలవుతానేమో! అని కాళిదాసు అంతటివాడే రఘువంశ మహాకావ్యం రాస్తూ సందేహించాడు).
ఈ సాహసానికి నాకు ప్రేరణ తెలుగులో అనువాదం గురించి సాకల్యంగా పుస్తకాలు లేకపోవడమే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు, ఉమామహేశ్వరరావు, కె. రాజ్య రమ గార్లతో కలిసి వ్యాఖ్యానాలు, భాషానువాదాలలోనూ, యంత్రానువాదంలోనూ చేసిన పరిశోధనలూ RGUKT వారికి నేను కొత్తగా తయారుచేసి చెప్పిన వీడియో పాఠాలూ ఈ గ్రంథానికి బాగా అక్కరకు వచ్చాయి.
ముఖ్యంగా ఎమ్. ఏ. తెలుగులోనూ, బి.ఎ.లోనూ అనువాదం ఒక ప్రత్యేక అంశంగా చాలా విశ్వవిద్యాలయాల్లో ఉంది. భాషాశాస్త్ర విభాగాల్లో అయితే తప్పనిసరి. పాశ్చాత్య సిద్ధాంతాలన్నీ ఆంగ్లంలో ఉండడం వల్ల కొత్తగా చేరిన భాషాశాస్త్ర విద్యార్థులకు అవన్నీ కొరుకుడు పడే స్థితి ఉండదు. అందువల్ల వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుందీ పుస్తకం. అంటే పూర్తిగా అనువాదానికి సంబంధించిన ప్రాచ్య, పాశ్చాత్య సిద్ధాంతాల సారాంశాన్ని సులభంగా అందించే ప్రయత్నం ఇది.
-
Author: Dr. Addnaki Srinivas
- Publisher: S R Publications (Latest Edition)
-
Paperback: 187 Pages
- Language: Telugu