Prema Pettubadi (Telugu) - 2016 - Chirukaanuka

Prema Pettubadi (Telugu) - 2016

Regular price ₹ 350.00

ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్‌ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్‌ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంటి వున్నది జీవన సహచరి జెన్నీ. అద్భుత సౌందర్యవతి. భర్తతోపాటు దుర్భర దారిద్య్రం గడిపింది. ఇది వాళ్ళ ప్రేమకథ. రచనల కారణంగా యూరోప్‌లో దేశ బహిష్కరణలకు గురై ఎక్కడా తలదాచుకోవటానికి చోటులేక లండన్‌కు చేరుకొని తన విప్లవకార్యాచరణ కొనసాగించాడు మార్క్స్‌. అయితే ఆయన జీవితమతా కేవలం రాజకీయాలు, ఆర్థిక, తాత్విక విషయాలు మాత్రమే కాదు, కుటుంబాన్ని అపురూపంగా చూసుకొన్న యింటి యజమానిగా, ప్రేమించే భర్తగా, పిల్లలకు తండ్రిగా ఆయనలోని మరో కోణాన్ని, హాస్యచతురతను మనకు పరిచయం చేస్తుందీ కథనం. ఇప్పటికీ లభ్యం కాని సమాచారం సేకరించి, ''మార్క్స్‌కు మరోవైపు''ను ఆవిష్కరించిన దాంపత్య గాధ. ట్రీయర్‌ నగరంలో ప్రారంభమై పారిస్‌, బ్రిసెల్స్‌, బెల్లిన్‌ యింకా అనేక నగరాలకు తిరిగి లండన్‌లో ముగుస్తుంది. - ముక్తవరం పార్థసారధి

  • Author: Mary Gabriel
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback: 551 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out