Prayojana Cinema (Telugu)
ప్రయో‘జన’ సినిమా ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ఐదేళ్ళకు పైగా (1987-92) నేను నిర్వహించిన రెగ్యులర్ కాలమ్. అది ముఖ్యంగా భారతీయ సమాంతర సినిమాను ప్రజలకు పరిచయం చేయడం కోసం రాసింది. దాన్నే మళ్ళీ మార్చి రాసి, క్రోడీకరించి, ఒక క్రమపద్ధతిలో పెట్టి ఈ పుస్తకానికి ఒక రూపమివ్వడం జరిగింది. వ్యాపార సినిమా కళాకారుల గురించి, సినిమాల గురించి అక్కడక్కడ కొన్ని విషయాలు కనిపించినా... జనంలో ఒక పరివర్తన తీసుకురావాలని ఒక ప్రయోజనాన్ని ఆశించి సినిమాలు తీసినవారి గూర్చి ఎక్కువగా ఇందులో ఉటంకించడం జరిగింది. ఫిలిం అప్రిషియేషన్ కోర్సులో పాల్గొని, ఫిలింక్లబ్‌లలో ఎన్నో మంచి సినిమాలు చూసిన అనుభవంతో ఇవి అలవోకగా రాసిన వ్యాసాలే తప్ప, ప్రత్యేకంగా పరిశోధించి రాసినవికావు. అయినా ప్రామాణికత దెబ్బతినకుండా ప్రయత్నించాను. సమాంతర సినిమాకు సంబంధించి ఇందులో చేర్చాల్సిన మహనీయులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి కృషిని నేను ఈ పుస్తకంలో గుర్తుచేయనంత మాత్రాన వారు తక్కువవారు కారు. ఇది నా శక్తిమేరకు చేసిన ప్రయత్నమే తప్ప, సమగ్రమేం కాదు. అయితే కేవలం సమాంతర సినిమాపై దృష్టి పెట్టి రాసిన వ్యాసాలు నాకంటే ముందు (1987-88 కంటే ముందు) తెలుగులో ఎవరూ రాసినట్టు లేదు. సమాంతర సినిమాను అభిమానించేవారు, సహృదయ విమర్శకులు ఇందులో నేను అందివ్వాలనుకున్న స్ఫూర్తిని స్వీకరిస్తారని ఆశిస్తాను.
- డా. దేవరాజు మహారాజు
- Author: Dr. Devaraju Maharaju
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 425 Pages
- Language: Telugu