Negadu (Telugu)
Sale price
₹ 119.00
Regular price
₹ 130.00
వానరం నరవానరంగా, నరవానరం నరునిగా మారడం ఏదో ఒక వారం పదిరోజుల్లో జరిగింది కాదు. లోల సంవత్సరాల మహా సంగ్రామం అది. మానవ జాతులు సంఘర్షిస్తూ సాధించుకున్న నాగరికత కూడా అంతే! ప్రక్రృతిపై పోరాటం, క్రూర జంతువులతో కుమ్ములాట, మనిషి మనిషితో యుద్ధం, కనికరం ఎరుగని కఠోర జీవనం, కర్కశంగా కబళించాలని చూసే కాలం... ఇన్ని అవరోధాలపై అలుపెరుగని యుద్ధం చేసి ఆదిమ మానవులు సాధించిన విజయమే నాగరికత. ఎన్ని తెగల తలలు తెగిపడితే, ఎందరి రక్తం ఏరులా పారి ఈ నేల నానితే ఈ నాగరిక జీవనం మనకు దక్కిందో! 50 లక్షల ఏళ్ళ సుదీర్ఘ మానవ జాతుల మహోన్నత పోరాటాల్ని, నాగరికతను మలుపుతిప్పిన మహా యుద్ధాల్ని, హాలీవుడ్ చిత్రంలా మీ కళ్ళముందుంచే పదిమంది మహాయోధుల కదనజీవితాల్ని తెలుపుతూ... తెలుగులో వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది!
- Author: Borra Govardhan
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 140 Pags
- Language: Telugu