Narayana Rao (Telugu) - 2015
''ఓరీ, వెర్రివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములలో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్య కానున్న యామెను వాంఛించుట ఎలాటి తప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమ, సంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు. అయినా నిన్ను కౌగిలించుకుంటున్నా!'' యనెను. నారాయణరావు హృదయం వేయి పాలసముద్రముల మునిగినట్లయినది. తత్‌క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు. వారిరువురు రాజారావు తల్లిదండ్రుల నొప్పించు మార్గమాలోచించుకొనిరి. వేదోక్త ప్రకారము వివాహము సలుపుట యుత్తమ మనుకొన్నారు. చెన్నపురిలో శ్యామసుందరీదేవి గారి కుటుంబమును నారాయణుని యింటిలో బెట్టి యచ్చట వివాహము సేయుట లెస్సయని నిర్ధారణ జేసికొన్నారు. కొన్ని దినములాగి అనేక విధముల వాదనలు చేసి, అనునయించి రాజారావు తల్లిదండ్రులను, రాజారావు శ్యామసుందరీదేవుల వివాహానికి ఒప్పించినాడు నారాయణరావు.
- Author: Adavi Bapiraju
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 432 pages
- Language: Telugu