Jeevana Samaram (Telugu)
ఒక విషయాన్ని ఎన్నుకోవడంలోనూ, ఎన్నుకొన్న విషయాన్ని ‘రసగుళిక’గా రూపొం దించడంలోనూ భరద్వాజ అవలంభించే విధానం విశిష్టమయింది. రచనా ప్రారంభం- పఠితలో ఉత్సుకతను రెక్కొలుపని పక్షంలో, పాఠకులు పక్క శీర్షికకు వెడతాడు. ‘అతి’ అనిపించకుండా చూసుకోవాలి. చదవడం పూర్తయ్యాక, ఓ గాఢమైన నిట్టూర్పు వెలువడాలి. కన్నీటి బిందువు పఠిత కన్నుల్లో కదలాలి. అమానుషమైన ఈ వ్యవస్థ మీద జుగుప్స కలగాలి. దీన్ని మార్చాలన్న ఆలోచన మెదడులో మెరవాలి. ఇందులో ఏ వొక్కటి లోపించినా ఆ రచన ఆ మేరకు తెటుకు పడినట్లేమరి!
‘జీవన సమరం’ శీర్షికన వెలువడిన ఈ రచనలన్నీ మన సామాజిక జీవనానికి ప్రతిబింబాలు. ఇందులోని వ్యక్తులు - మనకు బాగా తెలిసినవారు. మనతో బాటు మన మధ్యనే జీవిస్తున్నవారు. వీరిని గురించి మనం ఆలోచించం! వీరిని చూసి మనం స్పందించం. ఈ ‘‘అధోజగత్సహోదరు” ల బతుకుల్లోకి తొంగి చూడాలంటేనే మనకు భయం.
శ్రీ భరద్వాజ మనం చేయలేని ఈ పనులన్నీ చేశారు. వారి బతుకుల్లోకి తొంగి చూసి, స్పందించి, మనల్ని స్పందింపజేశారు. వేయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రకు - అచ్చంగా, అట్టడుగు వర్గాల యథార్థ చరిత్రలలో నిండిన తొట్టతొలి గ్రంథాన్ని చేర్చిన ఘనత భరద్వాజకు లభించినందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను.
- చెరుకూరి రామోజీరావు
- Author: Dr. Ravuri Bharadwaja
- Paperback: 156 pages
- Publisher: Visalandhra Publishing House
- Language: Telugu