Jailu Lopala (Telugu)
''జైలు లోపల'' కథల్లో మొదటి కథ 'పరిగె'. తెలంగాణ పల్లెలో సామాన్యుని జీవితం ఎంత దీనంగా వుండేదో ఈ కథ చెప్తున్నది. వెట్టిచాకిరి చేసే కింది కులాల వాళ్ళకు వాళ్ళ పొట్ట పోసుకోవటానికి సమయముండేది కాదు. గ్రామంలోని దొరలకు, గ్రామాధికారులకు, దౌరాలకు వచ్చే ప్రభుత్వోద్యోగులకు జీతబత్తాలు లేకుండా పనులు చేయాలి. ఈ కథలో మల్లయ్య ఖానాపురంలో వంతు మాదిగ. కూతుర్ని కని తల్లి చనిపోయింది. జీవితమంతా వెట్టిచాకిరి చేసి కండలు కరిగించిన తండ్రి మంచం పట్టాడు. ప్రేమతో పెంచి పెద్ద చేసిన చెల్లెలుకు, తండ్రికి ఇంత తిండి పెట్టని స్థితిలో వున్నాడు మల్లయ్య. ఒకరోజు మల్లయ్య వెట్టిచాకిరికి పోయి సాయంత్రం వచ్చాడు. ఆకలితో మలమల మాడుతున్న తండ్రికి, చెల్లెలుకు తినటానికి ఏమైనా గింజలు సంపాదించి తెస్తానని బయలుదేరిన మల్లయ్య ఒక చేనులో పరిగె కర్రలను పోగు చేసుకొని కట్ట కట్టుకొని సంతోషంగా బయలుదేరుతాడు.
- Author: Vattikota
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 78 Pages
- Language: Telugu