Geethanjali (Telugu) Perfect Paperback - 2012
నీ నుంచి నేనేమి కోరలేదు. నా పేరుకూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు ఇళ్లకు వెళ్లిపోయారు. "ప్రొద్దెక్కింది, నువ్వు రావు?" అని నన్ను పిలిచారు. కానీ నేను యేదేదో కలలు కంటూ ఇక్కడే నిల్చిపోయాను. నీవు వచ్చేటప్పుడు నీ అడుగులు చప్పుడు నాకు వినిపించలేదు. దీనంగా వున్నా కళ్ళతో నా వైపు చూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మెల్లగా నాతో మాట్లాడావు. "నేనొక పాంధుణ్ని. నాకు దాహం వేస్తుంది" అన్నావు. పగటి కలలలో మునిగివున్న నేను నీ మాటలు విని ఉల్లిక్కిపడి లేచి నా కుండలో నుంచి నీ దోసిట్లో నీరుపోశాను. పైన చెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్లు కొమ్మలలో దాగిన కోకిల కూజితం చేసింది. పులా పరిమళం త్రోవ కొననుంచి తేలుతూ వచ్చింది. నా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడు నేను సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నాను. అవును, నీవు నన్ను ఎల్లపుడు గుర్తుంచుకోటానికి నీకు నేను చేసిందేమిటి ? కానీ నీ దాహం తీర్చటానికి నిరిచ్చనన్న జ్ఞాపకం యప్పుడు నా హృదయంలో పచ్చగా వుంటుంది. నా హృదయాన్ని ఎల్లపుడు మాధుర్యంతో నింపేస్తుంది. చాలా ప్రొద్దెకింది. వేపచెట్టు ఆకులు గాలికి గలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున కూచుని కలలు కంటునాన్ను.
- Author: Ravindranath Tagore
- Perfect Paperback: 128 pages
- Publisher: Sahithi Prachuranalu (Latest Edition)
- Language: Telugu