Dalith Panthars Charitra (Telugu) - 2020
Regular price
₹ 180.00
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘దళిత్ పాంథర్స్ చరిత్ర’ పుస్తకాన్ని మార్చి 14న విశాఖపట్నంలో, మార్చి 15న హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ రెండు సమావేశాలలోనూ పుస్తక రచయిత జె. వి. పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖపట్నంలో రామాటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్లో జరిగిన సభను స్థానిక భీమసేన వారు నిర్వహించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జె. వి. పవార్ మాట్లాడుతూ మన సమాజంలో సమానత్వం రావాంటే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ రచనలను చదవాలన్నారు. ఈ ఉద్దేశంతోనే తను ముద్రణకు నోచుకోకుండా వుండిపోయిన అనేక అంబేడ్కర్ రచనలను సేకరించి, అంబేడ్కర్ భార్యనీ, కుమారుడినీ ఒప్పించి మొత్తం 22 సంపుటాల రూపంలో అంబేడ్కర్ సమగ్ర రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రచురింపజేసేందుకు నిబద్ధతతో కృషి చేసినట్టు చెప్పారు. అంబేడ్కర్ నిర్యాణానంతర ఉద్యమాలలో దళిత్ పాంథర్ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత వుందన్నారు. దళిత్ పాంథర్ సంస్థ కొద్ది కాలమే మనుగడ సాగించినప్పటికీ మహారాష్ట్రలో, ఆమాటకొస్తే యావత్ భారతదేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలనూ, అత్యాచారాలనూ ఎదిరించేలా దళిత్ యువతను సంఘటిత పరచడంలో, చైతన్య పరచడంలో చెప్పుకోతగ్గ విజయం సాధించిందని చెప్పారు

-
Author: J.V. Pavar
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
-
Paperback: 252 pages
- Language: Telugu