Cinema Kathalu (Telugu)

Cinema Kathalu (Telugu)

Regular price ₹ 200.00

ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఊహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ, ఎన్నో శతాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలనచిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తానుగా అభివృద్ది చెందుతూ, మిగతా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచీ కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా భావించబడ్డ ఎన్నో కథలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాగా తీయబడ్డ కథల సంకలనమే ఈ “సినిమా కథలు” దేశవిదేశాలకు చెందిన ఎంతో మంది గొప్ప రచయితల కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. సినిమా ప్రేమికులే కాకుండా సాహిత్య ప్రియులు సైతం నచ్చే ఈ కథలు ఇప్పుడు తెలుగులో చదువుకోవడమే కాకుండా, పాత్రల పేర్లు, నేపధ్యం, స్థలాలు ప్రాంతీకరించడం ద్వారా తెలుగుతనాన్ని సంతరించుకోవడం ఈ సంకలనం యొక్క ప్రత్యేకత.

  • Author: Venkat Sidda Reddy
  • Publisher: Anvikshiki Publications (Latest Edition)
  • Paperback: 219 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out