Bhojana Bhogam (Telugu)
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది ప్రాణాన్ని నిలుపుతోంది. ప్రాణానికొక జీవనీయతని కల్పిస్తోంది. సాక్షాత్తూ అన్నమే ఔషధంగా జీవుల్ని నడుపుతోంది.
ఆధునిక సమాజంలో అన్నం విషయంలో ఈ దృక్పథంలో కొంత మార్పు ఏర్పడింది. “ఆహారం వేరు- ఔషధాలు వేరు“ అనే దృష్టి పెరిగింది. “మీ ఇష్టం వచ్చింది తినండి- ఈ బిళ్ళ వేసుకోండి“ అంటేనే రోగికి డాక్టర్ నచ్చుతున్నాడు.
సారవంతమైన కూరగాయల్ని నిస్సారంగా వండుకుని తింటూ- కాళ్ళనొప్పులూ కడుపులో మంటలూ అని నిత్యరోగ పీడుతుల్లా మనం ఎందుకు మారిపోవాలి?
పొన్నగంటికూర కావాలంటే మనకి ఏ కూరగాయల మార్కెట్లోనూ దొరకదు. గంగ పావిలికూర చక్రవర్తికూర చిర్రికూర- వీటి సంగతి సరేసరి...పొలాల గట్లమీద పెరిగే ఈ ఓషధుల్ని పిచ్చి మొక్కలుగా రైతులు కూడా చాలామంది భావించడం ఆశ్చర్యకరమైన మార్పే! మన పెరట్లోనే ఆ పూటకు వంటకు కావలసిన మొక్కలు చాలా వుంటాయి. కానీ తినేవి కావేమోనని వాటి జోలికి మనం వెళ్ళడం లేదు.
ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నో ఆహారపదార్థాలు- వాటిని వండుకునే విధానం వాటి గుణదోషాల వివరాలు నిక్షిప్తంగా వున్నాయి. అన్నీ ఈ కాలం ప్రజలకు అవసరమైనవే! వాటిని సామాన్య మానవుడికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నమే ఈ “భోజన భోగం“
-
Author: Dr. G.V. Purnachand
- Publisher: Sri Madhulatha Publications (Latest Edition)
-
Paperback: 191 Pages
- Language: Telugu