Andhra Yuvakuda - Daari Itu (Telugu) - 2000 - Chirukaanuka

Andhra Yuvakuda - Daari Itu (Telugu) - 2000

Regular price ₹ 50.00

చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్‌ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్ఛవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్‌-కథ చదవండి. తెలుస్తుంది.

నిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్థుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకీ జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకథ-అసమర్థుడు.

ఆర్థిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు… జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒకవైపు… రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యీనాటి యువతరానికి దారి సూచించే కథ-ఆంధ్రయువకుడా! దారి ఇటు.

  • Author: Yadhanapoodi Sulochana Rani
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 136 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out