Andari Manishi (Telugu)
Regular price
₹ 95.00
అందరి మనిషి' లోని కథలను శశిశ్రీ 2011-2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. 'రాతిలో తేమ' కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి 1. అంతర్లోకం 2. బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాలమీద రాసినవి బహిర్లోకం. 'అందరి మనిషి' లోని పదకొండు కథలను కూడా అలాగే విభజించుకోవచ్చు. 'పెద్దల పండగ', 'పురానా హవేలి' పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, 'ఆరాత్రి ఆపాట', 'ఫో', 'అరుపు' హిందూ ముస్లిం సంబంధ కథలు, 'గుండెతడి', 'అందరి మనిషి', 'కిర్రుచెప్పులు', 'యెమ్టీఫెలో', 'గురువింద', 'కూపం', ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.
- Author: Shashisri
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback:
- Language: Telugu