Amara Hrudayam (Telugu) - 2000
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
నేను యిప్పడు విద్యాశాఖ చీఫ్ సెక్రటరీని. కాని చిన్నప్పుడు నా అల్లరి చూసిన ఎవరూ నేను యింతవాడిని అవుతానని కలలోకూడా అనుకోలేదు.పల్లెటూరులో చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళమంటే ఏడ్చి రాగాలు పెట్టేవాడిని,స్కూలు ఎగ్గొట్టి ఆటలు ఆడేవాణ్ణి. మార్కులు సున్నా రావటంత,మానాన్న పేను బెత్తంతో నా వీపు చీరేసేవాడు.ఎండలో నిలబెట్టేవాడు. అబ్బో!ఇప్పడు ఆ తన్నులు తలచుకుంటే”,హాలంతా నవ్వులకెరటంగా మారిపోయింది. ఆయన గంభీర స్వరంతో చెప్పసాగాడు “అలాంటి నేను, ఒక్క మేష్టారి వల్ల, ఏడాదిలో పూర్తిగా మారిపోయాను. ఆయనవల్ల నాజాతకం,నా జీవనగమ్యమే మారిపోయింది…
కాబట్టి ఉపాధ్యాయుడు ఎంతోమంది విద్యార్థుల మనసుల్లో జ్ఞానజ్యోతి వెలిగించగలడు.
ఈ మెర్రీ గోల్డ్ స్కూలు చరిత్రలో అలాంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు.
- Author: Yadhanapoodi Sulochana Rani
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 304 pages
- Language: Telugu