Aaro Aadapailla (Telugu) - 2016
సమాజంలోని పురుషాధిక్యాన్ని తేటతెల్లం చేసే నవల 'ఆరో ఆడపిల్ల'. కథ చిన్నదే; కాని ఆ కథ ద్వారా చిత్రీకరించిన ప్రపంచం చాలా విస్తృతం. పూల వ్యాపారి ఐన, పిల్లలు లేని శంకర్ రామన్ గుడిప్రాంగణంలోనుంచి తెచ్చిన అనాధ బాలికను ఇంటికి తెచ్చి 'కాదంబరి' అని పేరు పెట్టి పెంచుతాడు. ఈ పురుష ప్రపంచంలో అడుగడుగున కాదంబరి ఎదుర్కునే పీడనలు సమాజంలోని ఉన్నతుల వివక్ష చివరికి శంకర్ రామన్‌లో కూడా కనబడిన పురుషాధిక్య ధోరణి వగైరాలు బాహ్యంగా కనబడే అంశాలు. ఆ అంశాలను పట్టుకొని సమాజం లోతుకీ పురుషాధిక్యతనూ స్త్రీల మనస్తత్వపు లోతులకూ మనను తీసుకొని వెళ్తాడు రచయిత. మౌలికంగా సేతు స్త్రీవాద రచయిత. స్త్రీల మనోభావాలనూ ఆలోచనలనూ సూక్ష్మంగా పరిశీలించి వ్రాయబడిన నవలలు అతనివి. నినాదాలు వ్రాయకుండా స్త్రీల సమస్యలను సున్నితంగా మనసుకు హత్తుకునే విధంగా వ్రాసే స్త్రీల మనోవిశ్లేషకుడు సేతు. కాని ఒకటుంది. సేతు వ్రాసిన ప్రతి మాట వెనక, వాక్యం వెనక, మనకు కనబడని, ఆలోచిస్తే కాని అందని అర్థం వుంటుంది.
- Author: L.R.Swamy
- Publisher: Vishalamdra Pablishing House (2016)
- Paperback: 140 pages
- Language: Telugu