Edupadula Swathantryam (Telugu) - Chirukaanuka

Edupadula Swathantryam (Telugu)

Regular price ₹ 60.00

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బై ఏళ్లు పూర్తయింది. స్వాతంత్య్ర ఫలాలు కొందరికే పరిమితమయ్యాయి. దేశంలో అధికసంఖ్యలో ఉన్న పేదలు, దళితులు, మైనారిటీ ప్రజలకు అందడం లేదు. తెల్లవారి నుంచి నల్లవారి చేతుల్లోకి పాలన మారినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేదన్నది జగమెరిగిన సత్యం. పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ధనికులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్న పరిస్థితి. 58 శాతం సంపద కేవలం ఒకశాతంగా ఉన్న ధనికుల వద్ద పోగుబడింది. 67 శాతం మంది ప్రజలు నెలకు పది వేల రూపాయలు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు. 80 శాతం మంది పౌష్టికాహారం తీసుకోలేని స్థితిలో ఉన్నారు. సామాన్యులకే కాదు మధ్య తరగతి వారికి కూడా సరైన గూడు ఒక కలగా మారింది. దేశంలో నేటికీ 65 శాతం మంది జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. 25 శాతం మంది ప్రజలకు విద్యుత్తు అందుబాటులో లేదు. విద్యవైద్యం పూర్తిగా వ్యాపారమయమైపోయింది. చదువు కొనలేక 64 శాతం మంది ప్రాథమిక విద్య దశలో, 30 శాతం మంది మాధ్యమిక విద్య దశలో చదువుకు స్వస్తి పలికేస్తున్న పరిస్థితి. దేశంలో ఏ లక్ష్యాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారో ఆ లక్ష్యాలు ప్రజలకింకా కనుచూపుమేరలో లేవన్నది పుస్తక సారాంశం. పీపుల్స్‌ డెమక్రసీ, ఫ్రంట్‌లైన్‌లో ప్రచురితమైన వ్యాసాల సంగ్రహమే ఈ 'ఏడుపదుల స్వాతంత్య్రం'.

  • Author:
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback: 88 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out