Meeruu Success Sadhinchagalaru (Telugu) Paperback - 2016
పాజిటివ్ సైకాలజీలోని శక్తిమంతమైన సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ పుస్తకంలో సంతోషదాయకమైన జీవితం గడపడంకోసం, జీవితంలో సమున్నత విజయాలు సాధించటం కోసం అవసరమైన అనేక అంశాలు ఉన్నాయి. జీవితంలో ప్రతీక్షణాన్ని ఆనందంగా గడపటానికి ఉపయోగపడే మైండ్‌ఫుల్ మెడిటేషన్ గురించి, టెన్షన్, స్ర్టెస్ వంటి ప్రతికూల అంశాలను ఎదుర్కోవటానికి ఉపయోగపడే ‘రిలాక్సేషన్’ టెక్నిక్స్ గురించి పలు విషయాలు చర్చించటం జరిగింది. వ్యక్తులు తమ టాలెంట్‌ను గుర్తించటం, దానికి మెరుగులద్దుకోవటం వల్ల విజేతలుగా ఎదగవచ్చు. చేసేపనిలో ఆనందం, తృప్తి లభించినపుడుశారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. సరైన కమ్యూనికేషన్ వల్ల ఇతరులతో బలమైన సాంఘిక సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. ప్రశాంత మనసుతో, ఆత్మగౌరవంతో జీవించటానికి కావాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోవటం, ఆచరణలో పెట్టటం వల్ల అనునిత్యం ఆత్మ సంతృప్తి కలుగుతుంది.
- Author: Dr. Deshineni Venkateshwar Rao.
- Publisher: Emesco Publishers (Latest Edition)
- Paperback: 104 pages
- Language: Telugu