Aina Nenu Vodipoledhu (Telugu) - 2013
Sale price
₹ 65.00
Regular price
₹ 75.00
ఈ జ్యోతి అనే పల్లెటూరు అమ్మాయి ప్రపంచ ఆర్థిక విపణికి కేంద్రమైన అమెరికాలో స్థానం పొందటానికి కారణం ఆ అమ్మాయి భయాన్ని జయించడమని. నేను జ్యోతిని భయంలేని ఓ స్త్రీగా భావించడంలేదు, భయాన్ని జయించిన ఓ స్త్రీగా భావిస్తున్నాను. నాతో, మీతో సహా ఈ ప్రపంచంలోని అందరికీ బోల్డెన్ని కన్నీళ్లు వున్నాయి, బోల్డెన్ని కష్టాలు వున్నాయి. అయినా అనేకమంది కన్నీళ్లు, కష్టాల్ని దేవుడిచ్చిన శాపాలుగా భావిస్తూ జీవించేస్తున్నారు. కానీ, వాటితో నిరంతరం యుద్ధం చేస్తూ వాటిని అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగడాన్ని కొత్తదారి వెతుక్కోవడాన్ని కొందరే చేస్తున్నారు. వాళ్లే అనేకమందికి అసాధ్యమనిపించే విషయాలను, అనేకమంది ఊహించలేని విషయాలను సాధించినవాళ్లు. వాళ్లని విజేతలు అనడం కొంచెం తక్కువగా చూడటమే. వాళ్లని యోధులుగా మాత్రమే చూడాలి.
- Author: Joythi Reddy
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 128 pages
- Language: Telugu