Palegadu (Telugu) - 2018
‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని; ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరచి వారి ఏలుబడిలో వుండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాక స్వతంత్ర పాలనగా వుండేది. అలాంటి పాళెగాళ్ళ సంతతికి చెందిన వ్యక్తి రాయలసీమలో ‘రేనాటి సింహం’గా పిలువబడే వ్యక్తి. ఒక సమూహక శక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
బ్రిటిష్ ప్రభుత్వం కుటిలనీతితో, తన రాక్షసకబంధ హస్తాలతో భారతదేశాన్ని వశం చేసుకొని కిరాతక రాజ్యపాలన సాగిస్తోన్న కాలంలో వారిపై 1846లోనే విప్లవ శంఖం పూరించి, వారి అధికారుల్ని చంపి, భయభ్రాంతుల్ని చేసి రేనాటి సీమలో సంచలనం రేకెత్తించాడు.
చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహారెడ్డి సాహసగాథ మన హృదయాలను తాకుతుంది. పుస్తకం తెరిచిన తర్వాత మూసివేయకుండా పాఠకులను చదివిస్తుంది.
- Author: S.D.V. Azeez
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Hardcover: 149 Pages
- Language: Telugu